RIL AGM 2022: జియో నుంచి అల్ట్రా-అఫర్డబుల్ 5G స్మార్ట్‌ఫోన్‌, గూగుల్‌తో కలిసి జియో పనిచేస్తోందని తెలిపిన అధినేత ముఖేశ్‌ అంబానీ

ఇందుకోసం జియో గూగుల్‌తో కలిసి పనిచేస్తోందన్నారు.

RIL AGM 2022 (Photo Credits: YouTube)

దేశంలో 'అల్ట్రా-అఫర్డబుల్' 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) ఛైర్మన్ ముఖేశ్‌ అంబానీ ప్రకటించారు. ఇందుకోసం జియో గూగుల్‌తో కలిసి పనిచేస్తోందన్నారు. మేడ్ ఇన్ ఇండియా 5జీ సేవలకుగాను ప్రపంచంలోని ప్రముఖ టెక్ కంపెనీలను భాగస్వాములుగా ఉండటమ విశేషమని ముఖేష్ అంబానీ అన్నారు. జియో ప్రస్తుతం మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎరిక్సన్, నోకియా, శాంసంగ్, సిస్కో వంటి గ్లోబల్ నెట్‌వర్క్ టెక్నాలజీ ప్రొవైడర్లతో మంచి సంబంధాలున్నాయని చెప్పారు. అలాగే ఇండియా 5జీ సొల్యూషన్స్‌ డెవలప్‌మెంట్‌కి క్వాల్కంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు చెప్పారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)