Satya Nadella: భారత్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చిన మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, ప్రస్తుత పరిస్థితులు తనకు చాలా బాధకలిగించామంటూ ట్వీట్

భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల (Satya Nadella) భారత్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితులు తనకుచాలా బాధకలిగించామంటూ సత్య నాదెళ్ల సోమవారం ట్వీట్‌ చేశారు.

Satya-nadella-microsoft (Photo-PTI)

భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల (Satya Nadella) భారత్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితులు తనకుచాలా బాధకలిగించామంటూ సత్య నాదెళ్ల సోమవారం ట్వీట్‌ చేశారు. రోజులకు మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో ముఖ్యంగా తీవ్ర ఆక్సిజన్‌ కొరత నేపథ్యంలో దేశానికి సహాయం అందించనుట్టు ప్రకటించారు. సహాయ ఉపశమన ప్రయత్నాలు, సాంకేతిక పరిజ్ఞానం,ఇతర వనరుల ద్వారా నిరంతర మద్దతుతో పాటు కీలకమైన ఆక్సిజన్ సాంద్రత పరికరాల కొనుగోలుకు కంపెనీ మద్దతు ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు. అలాగే ఈ సందర్బంగా భారత్‌కు సాయం అందించేందుకు ముందుకొచ్చిన అమెరికా ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now