YONO Super Saving Days: ఎస్‌బీఐ యోనో సూపర్‌ సేవింగ్‌ డేస్‌ ఆఫర్లు, ఏప్రిల్‌ 7వ తేదీ వరకు 50 శాతం దాకా భారీ డిస్కౌంట్లు, మూడు నెలల్లో యోనో ద్వారా ఆఫర్లు ప్రకటించడం ఇది మూడో సారి

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ‘యోనో’ ద్వారా సూపర్‌ సేవింగ్‌ డేస్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 7వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు కొనసాగే ఈ సేల్‌లో కస్టమర్లకు 50 శాతం దాకా భారీ డిస్కౌంట్లను అందుబాటులోకి తీసుకొచ్చామంటూ ఎస్‌బీఐ తన ట్వీట్‌లో తెలిపింది. అమెజాన్‌, అపోలో, ఈజ్‌మైట్రిప్‌, ఓయోలాంటి టాప్‌ బ్రాండ్ల భాగస్వామ‍్యంతో ఈ ఆఫర్లను అందిస్తోంది. గత మూడు నెలల్లో యోనో ద్వారా ఆఫర్లు ప్రకటించడం ఇది మూడో సారి.

State Bank of India (Photo Credits: PTI)

ఆఫర్లు ఇవే

అమెజాన్‌: ఎస్‌బీఐ యోనో ద్వారా లావాదేవీల ద్వారా అమెజాన్‌లో 10 శాతం వరకు అదనంగా క్యాష్‌బ్యాక్‌ లబిస్తుంది. అపోలో : మెడిసిన్‌, చికిత్స నిమిత​ం అపోలో ద్వారా 25 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. @హోం : ఇంటికి సంబంధించిన ఫర్నీచర్‌ కొనుగోలు చేయాలంటే @హోమ్‌లో ఎస్‌బీఐ యోనో కస్టమర్లకు 12 శాతం అదనంగా తగ్గింపు. ఈజ్‌మైట్రిప్‌ వెబ్‌సైట్‌లో ఎస్‌బీఐ యోనో ద్వారా డొమెస్టిక్‌ విమానాలు బుక్‌ చేస్తే రూ.850 వరకు తగ్గింపు లభిస్తుంది. ఓయో: ఓయో బుకింగ్స్‌పై 50 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement