Chandrayaan-3 Mission: రోవర్ ప్రజ్ఞాన్ కొత్త వీడియో ఇదిగో, అమ్మ ఆప్యాయంగా చూస్తుండగా.. పెరట్లో ఆడుకుంటున్న చంటిబిడ్డలా రోవర్ ఉంది కదా అంటూ ట్వీట్
చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా రోవర్ ప్రజ్ఞాన్ జాబిల్లిపై ఉండే రాళ్లు, లోయలను పసిగడుతూ తన మార్గాన్ని జాగ్రత్తగా నిర్దేశించుకుంటోంది. 14 రోజుల గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు నిర్దేశించిన అన్వేషణను కొనసాగిస్తోంది. దీనికి సంబంధించిన కొత్త వీడియోను ఇస్రో షేర్ చేసింది.
చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా రోవర్ ప్రజ్ఞాన్ జాబిల్లిపై ఉండే రాళ్లు, లోయలను పసిగడుతూ తన మార్గాన్ని జాగ్రత్తగా నిర్దేశించుకుంటోంది. 14 రోజుల గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు నిర్దేశించిన అన్వేషణను కొనసాగిస్తోంది. దీనికి సంబంధించిన కొత్త వీడియోను ఇస్రో షేర్ చేసింది. రోవర్ ప్రజ్ఞాన్ సరైన దారిని వెతుక్కునే క్రమంలో అక్కడక్కడే తిరుగాడుతున్న దృశ్యాలను ల్యాండర్ ఇమేజర్ కెమెరా వీడియో తీసింది. ఈ వీడియోను ఇస్రో తన అధికారిక ఖాతాలో పంచుకుంది. అమ్మ ఆప్యాయంగా చూస్తుండగా.. పెరట్లో ఆడుకుంటున్న చంటిబిడ్డలా రోవర్ భలే ఉంది కదా..? అంటూ క్యాప్షన్‌ను కూడా జోడించింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)