Aditya L1 Launch on September 2: సూర్యుడు గుట్టు విప్పేందుకు 23 గంట‌ల 40 నిమిషాల కౌంట్‌డౌన్ స్టార్ట్, రేపు నింగిలోకి దూసుకుపోనున్న ఆదిత్య ఎల్‌1 మిషన్

సూర్యుడి అధ్య‌య‌నం కోసం ఆదిత్య ఎల్‌1(Aditya L1) మిష‌న్‌ను ఇస్రో చేప‌డుతున్న విష‌యం తెలిసిందే.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్‌ ద్వారా ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది.

ISRO (Credits: PTI)

రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహించనున్నారు. ఇందుకోసం శుక్రవారం ఉదయం 11.50 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియను ప్రారంభించారు. 23 గంట‌ల 40 నిమిషాల కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిన‌ట్లు ఇస్రో తెలిపింది.ఎల్‌1 ప్ర‌యోగాన్ని శ‌నివారం ఉద‌యం 11.20 నిమిషాల నుంచి డీడీలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారంలో చూడ‌వ‌చ్చు.

Here's ISRO Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now