Blue Rays Skin Damage: స్మార్ట్ ఫోన్ల నీలి కాంతితో చర్మానికి ముడతలు.. తాజా అధ్యయనంలో వెల్లడి
నిద్రకు భంగం వాటిల్లుతుంది. మానసిక ఒత్తిడి కూడా కలుగుతుంది. అయితే ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు, టీవీల నుంచి వెలువడే నీలి కాంతి వల్ల చర్మంపై ముడతలు ఏర్పడుతాయని తాజా అధ్యయనంలో తేలింది.
Newdelhi, July 29: స్మార్ట్ ఫోన్లు (Smart Phones) అతిగా వాడటం వల్ల కళ్లు (Eyes) ఒత్తిడికి గురవుతాయి. నిద్రకు భంగం వాటిల్లుతుంది. మానసిక ఒత్తిడి కూడా కలుగుతుంది. అయితే ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు, టీవీల నుంచి వెలువడే నీలి కాంతి వల్ల చర్మంపై ప్రభావం పడుతుందని తెలుసా? స్మార్ట్ ఫోన్ తెర మీద నుంచి వెలువడే నీలి కాంతి.. చర్మం లోని కొల్లాజెన్ ప్రొటీన్ పై ప్రభావం చూపుతుందని, ఇది చర్మంపై ముడతలకు దారితీస్తుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ మేరకు మిషిగన్ స్టేట్ యూనివర్సిటీ, డెట్రాయిట్ లోని హెన్రీ ఫోర్డ్ దవాఖాన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. స్మార్ట్ ఫోన్ వాడకాన్ని తగ్గించడం మంచిదని సూచించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)