Chandrayaan 3 Mission Update: ప్రజ్ఞాన్ ప్రయాణిస్తున్న దారిలో పెద్ద గొయ్యి, వెంటనే అలర్ట్ అయి రోవర్ రూట్ మార్చిన ఇస్రో
దీంతో వెంటనే అప్రమత్తమైన ఇస్రో శాస్త్రవేత్తలు.. రోవర్ రూట్‌ను మార్చారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఇస్రో (ISRO) సోమవారం ఎక్స్ (ట్విటర్)లో అప్‌డేట్ ఇచ్చింది.
చందమామ దక్షిణ ధ్రువం సమీపంలో అడుగుపెట్టిన చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రజ్ఞాన్ రోవర్ (Rover) ప్రయాణిస్తున్న మార్గంలో లోతైన గొయ్యి కన్పించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఇస్రో శాస్త్రవేత్తలు.. రోవర్ రూట్‌ను మార్చారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఇస్రో (ISRO) సోమవారం ఎక్స్ (ట్విటర్)లో అప్‌డేట్ ఇచ్చింది.
ఆగస్టు 27న రోవర్ (Rover) ఉన్న ప్రాంతానికి మూడు మీటర్ల దూరంలో గొయ్యి కన్పించింది.నాలుగు మీటర్ల వ్యాసంతో భారీ గొయ్యి ఉంది. దీంతో తన మార్గాన్ని మార్చుకోవాలని రోవర్‌కు కమాండ్ ఇచ్చాం. ప్రస్తుతం రోవర్ తన కొత్త మార్గంలో సురక్షితంగా ప్రయాణిస్తోంది’’ అని ఇస్రో (ISRO) రాసుకొచ్చింది. ఆ గొయ్యి ఫొటోను కూడా షేర్ చేసింది. రోవర్‌లోని నావిగేషన్ కెమెరా ద్వారా ఈ గొయ్యిని గుర్తించినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ సందర్భంగా కొత్త మార్గంలో రోవర్ ప్రయాణించిన గుర్తులను కూడా పంచుకుంది.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)