Chandrayaan 3: ఎంత క్యూట్ గా దిగిందో.. విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ ఎలా బయటకు వస్తుందో తెలిపే వీడియో ఇదిగో, ట్రాక్ పైన ప్రయాణిస్తూ జాబిల్లిపై మెల్లిగా..
విక్రమ్ ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వస్తున్న వీడియోను ఇస్రో తాజాగా విడుదల చేసింది. ట్విట్టర్లో ఈ వీడియోను షేర్ చేసింది.
చందమామపై ప్రస్తుతం పలు పరిశోధనలు చేస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ కు సంబంధించి కీలక వీడియోను ఇస్రో ట్వీట్ చేసింది. విక్రమ్ ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వస్తున్న వీడియోను ఇస్రో తాజాగా విడుదల చేసింది. ట్విట్టర్లో ఈ వీడియోను షేర్ చేసింది. ఇందులో ల్యాండర్ నుంచి రోవర్ ప్రజ్ఞాన్ నెమ్మదిగా బయటకు వచ్చి, ట్రాక్ పైన ప్రయాణిస్తూ జాబిల్లిపై అడుగుపెట్టడం కనిపిస్తోంది.
చంద్రయాన్-2 ఆర్బిటర్ కు సంబంధించి శుక్రవారం ఉదయం చేసిన ట్వీట్ ను ఇస్రో తొలగించింది. దీనికి కారణాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఇస్రో తొలగించిన ఆ ట్వీట్ లో ఏముందంటే.. చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ ను చంద్రయాన్-2 ఆర్బిటర్ ఫొటో తీసిందని ఇస్రో పేర్కొంది. ‘నువ్వెప్పుడూ నా నిఘా పరిధిలోనే ఉంటావు’ అంటూ క్యాప్షన్ జతచేసి ఈ ఫొటోను ట్విట్టర్ లో పెట్టింది. ఆపై కాసేపటికే ఈ పోస్టును తొలగించింది.
ఈ నెల 23న విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. సాయంత్రం 6:04 నిమిషాలకు విక్రమ్ జాబిల్లిపై ల్యాండ్ కాగా.. రాత్రి పది గంటల ప్రాంతంలో రోవర్ బయటకు వచ్చింది.
Here's Video