Double Up On Exercise To Prevent High BP: వ్యాయామం రెట్టింపు చేస్తే అధిక రక్తపోటుకు చెక్.. కాలిఫోర్నియా పరిశోధకుల అధ్యయనం

అధిక రక్తపోటు నివారణకు వ్యాయామాన్ని రెట్టింపు చేయాల్సిన అవసరం ఉన్నదని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకుల తాజా అధ్యయనం వెల్లడించింది.

kids bp

Newdelhi, June 13: అధిక రక్తపోటు (High Blood Pressure) నివారణకు వ్యాయామాన్ని రెట్టింపు చేయాల్సిన అవసరం ఉన్నదని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకుల తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ మేరకు ప్రస్తుత మార్గదర్శకాలను మార్చాలని అభిప్రాయపడింది. పెద్దల శారీరక శ్రమలో కనీస ప్రమాణాల్ని (Double Up On Exercise) రెట్టింపు చేయాలని, తద్వారా హై బీపీని నివారించవచ్చునని పరిశోధకులు తెలిపారు. ఈ మేరకు 5 వేల మందిపై అధ్యయనం చేశారు. ఈ అధ్యయనాన్ని ‘అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌’ ప్రచురించింది. హై బీపీ సమస్య పెరగడానికి కారణం..18 నుంచి 40 ఏండ్ల వాళ్లలో వ్యాయామం చేసేవాళ్లు గణనీయంగా తగ్గడమేనని నివేదిక తెలిపింది.

మీ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందా? అయితే, మీ గుండెకు హాని జరుగొచ్చు.. తాజా అధ్యయనంలో తేలింది ఇదే!

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement