Pig Kidney Transplant: పంది కిడ్నీ అమర్చిన వ్యక్తి మృతి.. శస్త్రచికిత్స జరిగిన రెండు నెలల అనంతరం విషాదం
పంది కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకొన్న ప్రపంచంలోనే తొలి వ్యక్తి అయిన రిచర్డ్ స్లేమాన్ (62) తాజాగా మృతిచెందారు.
Newdelhi, May 13: పంది కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ (Pig Kidney Transplant) చేయించుకొన్న ప్రపంచంలోనే తొలి వ్యక్తి అయిన రిచర్డ్ స్లేమాన్ (62) తాజాగా మృతిచెందారు. రెండు నెలల కిందట స్లేమాన్ కు జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీని (Pig Kidney) అమర్చారు. అది సక్సెస్ అయింది కూడా. దీంతో ఆపరేషన్ అయిన రెండు వారాల అనంతరం అతడిని డిశ్చార్జి చేశారు. అయితే, తాజాగా ఆయన మరణించారు. అయితే, స్లేమాన్ ఆకస్మిక మరణానికి, శస్త్రచికిత్సకు ఎలాంటి సంబంధం లేదని దవాఖాన వర్గాలు వెల్లడించాయి. మధుమేహం లాంటి దీర్ఘకాలిక సమస్యలు మృతుడికి ఉన్నట్టు గుర్తుచేశాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)