Harsh Goenka on ISRO Chief Salary: ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ నెల జీతం రూ. రెండున్నర లక్షలు, ఇది ఆయనకు తగిన జీతమేనా అని ప్రశ్నించిన హర్ష గోయెంకా
ఇస్రో చైర్మన్ సోమనాథ్ నెల జీతంగా రెండున్నర లక్షలు సంపాదిస్తున్నారని తెలిపిన గోయింకా.. ఇది ఆయనకు తగిన జీతమేనా అని ప్రశ్నించారు. శాస్త్రీయ విజ్ఞానం, పరిశోధనలపై సోమనాథ్‌కు ఉన్న ఆసక్తి, నిబద్ధతను వివరిస్తూ ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ నెలవారీ జీతాన్ని ట్విటర్ వేదికగా ఆర్‌పీజీ గ్రూప్ అధినేత హర్ష గోయెంకా బహిర్గతం చేయడంతో ఇస్రో చైర్మన్ పేరు తీవ్ర చర్చకు దారితీసింది.ఇస్రో చైర్మన్ సోమనాథ్ నెల జీతంగా రూ. రెండున్నర లక్షలు సంపాదిస్తున్నారని తెలిపిన గోయింకా.. ఇది ఆయనకు తగిన జీతమేనా అని ప్రశ్నించారు. శాస్త్రీయ విజ్ఞానం, పరిశోధనలపై సోమనాథ్‌కు ఉన్న ఆసక్తి, నిబద్ధతను వివరిస్తూ ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తారు.
హర్ష గోయెంకా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనేకమంది నెటిజన్లు తమ స్పందన తెలియజేస్తున్నారు. సోమనాథ్‌కు ఎక్కువ సాలరీ ఇవ్వాలని.. ఆయనలాంటి వాళ్ల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని పేర్కొంటున్నారు. మరికొంతమంది.రెండున్నర లక్షలు అనేది ప్రాథమిక వేతనం అయి ఉండవచ్చని, ఇతర అలవెన్సన్‌లు కూడా కలపాలని కామెంట్ చేస్తున్నారు.
Here's Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)