Snake Bite Toxin: పాముకాటుకు కొత్త విరుగుడు.. సింథటిక్ యాంటీబాడీని తయారుచేసిన ఐఐఎస్‌సీ సైంటిస్టులు.. 15 రెట్లు సమర్థంగా పనిచేస్తున్నట్టు వెల్లడి
దీంతో పాముకాటుకు కొత్త తరహా విరుగుడును ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
Newdelhi, Feb 23: పాము కాటు(Snake Bite)తో ఏటా దేశంలో దాదాపు 60 వేల మంది మృత్యువాత పడుతున్నారు. దీంతో పాముకాటుకు కొత్త తరహా విరుగుడును ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) (IISc) శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పాము విషాన్ని నిర్వీర్యం చేసే సింథటిక్ యాంటీబాడీ తయారుచేశారు. తైవాన్ పాము విషాన్ని ఎలుకలకు ఇంజెక్ట్ చేసి, యాంటీబాడీల పనితీరును పరిశీలించారు. భారత్ లోని నాగుపాము, సబ్ సహారాలో ఎక్కువగా ఉండే బ్లాక్ మాంబా పాము విషాలపైనా ప్రయోగాలు చేశామని, సంప్రదాయ యాంటీబాడీల కన్నా.. ప్రస్తుతం అభివృద్ధి చేసిన సింథటిక్ యాంటీబాడీ దాదాపు 15 రెట్లు సమర్థంగా పనిచేస్తున్నదని సైంటిస్టులు తేల్చారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)