
Newdelhi, Jan 28: దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్ (Kris Gopalakrishnan) పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనది. బెంగళూరు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఐఐఎస్ సీ డైరెక్టర్ బలరాం సహా మొత్తం పద్దెనిమిది మందిపై సదాశివనగర్ పోలీసులు కేసు పెట్టారు. 2014లో తనను అన్యాయంగా హనీట్రాప్ కేసులో ఇరికించి ఉద్యోగంలో నుంచి తొలగించారంటూ ఐఐఎస్ సీ మాజీ ప్రొఫెసర్ దుర్గప్ప ఫిర్యాదు చేశారు. క్రిస్ గోపాలకృష్ణన్ సహా మరో 17 మందిపై ఆయన అభియోగాలు మోపారు. వీటిపై 71 సిటీ సివిల్, సెషన్స్ కోర్టు విచారించింది. చివరకు కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఈ అంశంపై క్రిస్ గోపాలకృష్ణన్ కానీ ఐఐఎస్ సీ బృందం కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.
A case was registered against Infosys co-founder Senapathy Kris Gopalakrishnan, former IISc Director Balaram and 16 others under the Prevention of SC/ST Atrocities Act. https://t.co/apMMcGnL9G
— The Hindu (@the_hindu) January 28, 2025
ఆరోపణలు ఏమిటంటే?
ఫిర్యాదుదారు దుర్గప్ప బోవి కమ్యూనిటీ (గిరిజన)కి చెందినవారు. సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీలో ఫ్యాకల్టీ సభ్యుడిగా ఉన్న సమయంలో తనను హనీట్రాప్ కేసులో ఇరికించారని ఆరోపించారు. అనంతరం తనను కులం పేరుతో దూషించడంతో పాటు బెదిరింపులకు గురిచేశారని ఆయన ఆరోపించారు. మొత్తం పద్దెనిమిది మందిపై ఫిర్యాదు చేశారు.