బిగ్‌బాస్ ఫేం, ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ గంజాయి సేవిస్తూ నార్సింగి పోలీసులకు పట్టుబడ్డాడు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్‌ని అదుపులోకి తీసుకునేందుకు తన ఫ్లాట్‌కి వెళ్లిన పోలీసులకు.. అక్కడ షణ్ముఖ్ గంజాయి సేవిస్తూ కనిపించాడు. దీంతో సంపత్ వినయ్‌తో పాటు షణ్ముఖ్‌ని నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇక షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ యువతితో ప్రేమలో పడి మూడేళ్ల క్రితం ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను దూరం పెట్టి 20 రోజుల క్రితం వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడు. విషయం ప్రియురాలికి తెలియడంతో.. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్..బస్సులు, వాహనాల విధ్వంసం కేసులో అరెస్టు చేసిన పోలీసులు
యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సంపత్‌ని అదుపులోకి తీసుకునేందుకు షణ్ముఖ్ నివాసానికి వెళ్లారు. పోలీసులతో పాటు యువతి కూడా అక్కడికి వెళ్లింది. ఇంట్లోకి వెళ్లి చూడగా..షణ్ముఖ్ ఒక్కడే కనిపించాడు. అతని వద్ద గంజాయి లభించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నాడు. ఈ సమయంలో సదరు యువతితో షణ్ముఖ్ దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. షణ్ముఖ్ సోదరుడు సంపత్ వద్ద 16 గ్రాముల గంజాయి లభ్యమయినట్లు తెలుస్తోంది.