Egg Cells from Skin Cells: సంతాన లేమితో బాధపడేవారికి శుభవార్త.. చర్మ కణాలతో అండాల సృష్టి.. ఒరెగావ్ హెల్త్ అండ్ సైన్స్ విశ్వవిద్యాలయం పరిశోధకుల వెల్లడి
చర్మపు జీవాణువులను అండాలుగా మార్చి, తద్వారా ఆరోగ్యవంతమైన పిండాలను సృష్టించే ప్రక్రియను ఒరెగావ్ హెల్త్ అండ్ సైన్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు అభివృద్ధి చేశారు.
Newdelhi, Mar 10: సంతాన లేమితో బాధపడేవారికి ఊరట కలిగించే వార్త ఇది. చర్మపు జీవాణువులను (Skin Cells) అండాలుగా మార్చి (Egg Cells), తద్వారా ఆరోగ్యవంతమైన పిండాలను సృష్టించే ప్రక్రియను ఒరెగావ్ హెల్త్ అండ్ సైన్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు అభివృద్ధి చేశారు. వంధ్యత్వ చికిత్సకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ఎలుకలపై దీనిని విజయవంతంగా ప్రయోగించినట్లు ఓ ప్రకటనలో చెప్పారు. తాజా ప్రయోగంతో ఏదో ఓ నాటికి దీని ద్వారా సజాతి జంటలు కూడా ఇరువురి జీవ సంబంధం గల పిల్లలను పొందడానికి అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)