ISRO Chief on Aditya L-1 Mission: చంద్రుడు తర్వాత సూర్యుడిని టార్గెట్ చేసిన ఇస్రో, సూర్యుడిపై పరిశోధనలకు సెప్టెంబర్‌‌ మొదటివారంలో ఆదిత్య మిషన్‌ చేపడుతున్నట్లు వెల్లడి

చంద్రయాన్–3 విజయంతో ఇస్రో దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా నిలిచింది. ఈ జోష్‌లోనే మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. సూర్యుడిపై చేపట్టనున్న ఆదిత్య మిషన్‌ గురించి ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ISRO chief S Somanath on Aditya L-1 and Gaganyaan mission (Photo-ANI)

చంద్రయాన్–3 విజయంతో ఇస్రో దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా నిలిచింది. ఈ జోష్‌లోనే మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. సూర్యుడిపై చేపట్టనున్న ఆదిత్య మిషన్‌ గురించి ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య మిషన్‌ను సెప్టెంబర్‌‌ మొదటివారంలో చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రయోగం కోసం ఆదిత్య మిషన్‌ సిద్ధమవుతోందని చెప్పారు. గగన్‌యాన్‌ ఇంకా ప్రోగ్రెస్‌లో ఉందని చెప్పారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు కూడా చేపడతామని వివరించారు.

సెప్టెంబర్‌‌ లేదా అక్టోబర్‌‌లో ఒక మిషన్ చేపడుతామని ఇస్రో చీఫ్ సోమనాథ్ ప్రకటించారు. దారి తర్వాత క్రూ మాడ్యూల్, క్రూ ఎస్కేప్ సామర్థ్యాన్ని పరీక్షిస్తామని వెల్లడించారు. పలు టెస్టు మిషన్ల తర్వాత 2025లో రోదసిలోకి మనిషి పంపిస్తామని ప్రకటించారు. ఇక చంద్రయాన్ ల్యాండర్, రోవర్ చక్కగా పని చేస్తున్నాయని తెలిపారు.

ISRO chief S Somanath on Aditya L-1 and Gaganyaan mission (Photo-ANI)

Here's ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement