Aditya L1 Launch on September 2: చెంగాలమ్మ పరమేశ్వరీ దేవి ఆలయాన్ని సందర్శించిన ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్, రేపు ఆదిత్య ఎల్-1 ప్రయోగం
సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ పరమేశ్వరీ దేవి ఆలయాన్ని (Sri Chengalamma Parameshwari temple) ఇస్రో చైర్మన్ (ISRO Chairman) ఎస్ సోమనాథ్ (S Somanath ) సందర్శించారు. శుక్రవారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఆలయానికి చేరుకున్న ఆయన.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రేపు చేపట్టబోయే ఆదిత్య ఎల్-1 (Aditya-L1) ప్రయోగం విజయవంతం కావాలని వేడుకున్నారు.సూర్యుని రహస్యాలను ఛేదించడమే లక్ష్యంగా ఆదిత్య ఎల్-1 (Aditya-L1) ప్రయోగాన్ని రేపు ఇస్రో చేపట్టబోతోంది. శనివారం ఉదయం 11.50 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ప్రయోగించనుంది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ (Countdown) ఈరోజు ప్రారంభమైంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)