Vikram Soft Landing: సాఫ్ట్‌ ల్యాండింగ్‌ లో ‘దుమ్ము’ రేపిన ల్యాండర్‌ విక్రమ్‌.. పైకి లేచిన 2 టన్నుల మట్టి.. ఇస్రో వెల్లడి

చంద్రుడిపై పరిశోధనల నిమిత్తం ఇస్రో పంపిన చంద్రయాన్‌-3 నిజంగానే ‘దుమ్ము’రేపింది.

Chandrayaan 3 (PIC@ X)

Newdelhi, Oct 28: చంద్రుడిపై (Moon) పరిశోధనల నిమిత్తం ఇస్రో (ISRO) పంపిన చంద్రయాన్‌-3 (Chandrayaan 3) నిజంగానే ‘దుమ్ము’రేపింది. ఆగస్టు 23న ల్యాండర్‌ విక్రమ్‌ (Lander Vikram) జాబిల్లి పై అడుగుపెట్టే క్రమంలో శివశక్తి పాయింట్‌ వద్ద పెద్ద మొత్తంలో దుమ్ము, ధూళి, చిన్న చిన్న రాళ్లు పైకిలేచాయని, దాదాపు 2.06 టన్నులమేర మట్టి 108 చదరపు మీటర్ల విస్తీర్ణంలో స్థానభ్రంశం చెందినట్టు ఇస్రో సైంటిస్టులు వెల్లడించారు. దీనికి సంబంధించి తాజా వివరాల్ని ఇస్రో ‘ఎక్స్‌’లో విడుదల చేసింది. సాఫ్ట్‌ ల్యాండింగ్‌ సమయంలో చంద్రుడి పైపొరలోని పదార్థాలు (దుమ్ముధూళి, ఖనిజ, రాళ్ల శకలాలు వంటివి) పక్కకు జరిగినట్టు తెలిపింది. విక్రమ్‌ ల్యాండర్‌ చుట్టూ ఆ పదార్థాలతో భారీ వలయాకార పరిధి ఏర్పడినట్టు ఇస్రో పేర్కొన్నది.

Onion Price Hike: నిన్నటివరకు టమోటా మోత, నేడు ఉల్లి ఘాటు.. 57 శాతం పెరిగిన రిటైల్‌ ఉల్లి ధర.. ధరాఘాతంతో విలవిలలాడుతున్న సామాన్యుడు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement