Luna-25: రష్యా వ్యోమనౌక ‘లూనా-25’లో ఎమర్జెన్సీ సమస్య.. జాబిల్లిపై ల్యాండింగ్ ప్రశ్నార్థకం.. సమస్యను తమ శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారని రష్యా అంతరిక్ష సంస్థ వెల్లడి
జాబిల్లిపై చంద్రయాన్-3 (Roscosmos) కంటే ముందే దిగేలా రష్యా అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్ (Roscosmos) ప్రయోగించిన లూనా-25 (Luna-25) వ్యోమనౌకలో ఊహించని సమస్య తలెత్తింది.
Newdelhi, Aug 20: జాబిల్లిపై చంద్రయాన్-3 (Roscosmos) కంటే ముందే దిగేలా రష్యా అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్ (Roscosmos) ప్రయోగించిన లూనా-25 (Luna-25) వ్యోమనౌకలో ఊహించని సమస్య తలెత్తింది. చంద్రుడి చుట్టూ చివరి కక్ష్య అయిన ప్రీలాండింగ్ ఆర్బిట్‌లోకి లూనా-25ని చేర్చేందుకు జరిగిన ప్రయత్నం అనుకున్న రీతిలో సాగలేదు. ఈ సమస్యను రష్యా శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలిస్తున్నారు. ‘‘లూనా-25లో ఎమర్జెన్సీ తలెత్తింది. ఫలితంగా, వ్యోమనౌకను అనుకున్న విధంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టలేకపోయాము’’ అని రష్యా అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్ ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో, తదుపరి ఏం జరగనుంది? చంద్రుడిపై లూనా-25 ల్యాండింగ్ సాధ్యపడేదేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా నిపుణుల బృందం ఈ సమస్యను నిశితంగా అధ్యయనం చేస్తోందని కూడా రాస్‌కాస్మోస్ వెల్లడించింది.