Wine Taste with AI: ఏఐ సాయంతో వైన్ రుచి తెలుసుకోవచ్చు.. ఎలాగంటే??
ఇకపై ఈ రంగంలోకి కృత్రిమ మేధ(ఏఐ) ప్రవేశించబోతోంది. దీంతో వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా రుచికరమైన వైన్‌ను ఆస్వాదించడం సాధ్యమవుతుంది.
Newdelhi, Dec 3: వైన్ (Wine) ను రుచి చూసి ఎలా ఉందో చెప్పడం చాలా ఆకర్షణీయమైన వృత్తి. ఇకపై ఈ రంగంలోకి కృత్రిమ మేధ(ఏఐ) (AI) ప్రవేశించబోతోంది. దీంతో వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా రుచికరమైన వైన్ ను ఆస్వాదించడం సాధ్యమవుతుంది. టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్, ది యూనివర్సిటీ ఆఫ్ కోపెన్ హాగన్, కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ విప్లవాత్మక విజయాన్ని సాధించినట్లు తెలిపారు. వైన్ రుచిని కృత్రిమ మేధ(ఏఐ) ద్వారా గుర్తించడంలో సఫలమైనట్లు చెప్పారు. బీర్, కాఫీల రుచిని కూడా ఇదే విధంగా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)