Tattoos Increase Risk of Blood Cancer: టాటూలతో బ్లడ్ క్యాన్సర్ వచ్చే ముప్పు.. లింఫోమా వచ్చే ముప్పు 21 శాతం వరకూ.. స్వీడన్ పరిశోధకులు వెల్లడి
అయితే చర్మంపై వేసుకొనే టాటూలతో లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్ వచ్చే ముప్పు ఉన్నట్టు స్వీడన్ పరిశోధకులు హెచ్చరించారు.
Newdelhi, May 28: శరీరంపై టాటూలు (Tattoos) వేసుకోవడం నేటి కాలంలో ఒక ట్రెండ్ గా మారింది. అయితే చర్మంపై వేసుకొనే టాటూలతో లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్ (Blood Cancer) వచ్చే ముప్పు ఉన్నట్టు స్వీడన్ పరిశోధకులు హెచ్చరించారు. క్యాన్సర్ వచ్చే ప్రమాదం 21 శాతం వరకూ ఉంటుందని తెలిపారు. లింఫోమా బ్లడ్ క్యాన్సర్ బారినపడిన 2,938 మందితో కలిపి మొత్తంగా 11,905 మందిపై ఈ అధ్యయనం చేశారు. టాటూలు వేసుకోని వారితో పోలిస్తే, వేసుకొన్న వారిలో క్యాన్సర్ కణాల వృద్ధి ఎక్కువ వేగంగా జరిగినట్టు పరిశోధకులు తేల్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)