Paid Promotions in Social Media: సోషల్ మీడియాలో చెప్పకుండా పెయిడ్ ప్రమోషన్ చేస్తే రూ.50 లక్షల జరిమానా, కొత్త నిబంధనలు అమల్లోకి
ఇకపై వీరు తాము చేసేది పెయిడ్ ప్రమోషన్ అని ముందే చెప్పి తీరాలి. లేదంటే రూ.50 లక్షల జరిమానా చెల్లించాల్సి వస్తుంది.
యూట్యూబ్ చానళ్లు, ఇన్ స్టాగ్రామ్ రీల్స్, ట్విట్టర్ తదితర వేదికలపై డబ్బులు తీసుకుని వివిధ సంస్థలు, ఉత్పత్తులకు అనుకూల కథనాలను ప్రసారం చేస్తుంటారు. ఇకపై వీరు తాము చేసేది పెయిడ్ ప్రమోషన్ అని ముందే చెప్పి తీరాలి. లేదంటే రూ.50 లక్షల జరిమానా చెల్లించాల్సి వస్తుంది. పెయిడ్ ప్రమోషన్ అని చెప్పకుండా వీడియోలు, పోస్ట్ లను పెట్టే వారిపై సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ)కి ఫిర్యాదు చేయవచ్చు.
విచారణ అనంతరం నిజమని తేలితే కనుక ఆయా వ్యక్తులు, చానళ్లపై రూ.50 లక్షల జరిమానా పడుతుంది. ఈ నెల 24 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ నూతన నిబంధనలు కేవలం సోషల్ మీడియా చానళ్లకే కాకుండా, ఇతర సెలబ్రిటీలు, ఆర్థిక సలహాదారులు అందరికీ వర్తిస్తాయి.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)