SpiceJet Layoffs: 1000 మందికి పైగా ఉద్యోగులను తీసేస్తున్న స్పైస్ జెట్, పొదుపు చర్యలకు ఉపక్రమించిన ప్రముఖ ఎయిర్ లైన్స్ దిగ్గజం

నిధుల కొరతతో సతమతం అవుతున్న దిగ్గజం పొదుపు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే వచ్చే నెలాఖరులోపు 15 శాతం మంది సిబ్బందిని ఇంటికి సాగనంపాలని భావిస్తున్నదని సమాచారం

Spicejet Airlines

ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ‘స్పైస్ జెట్’ దాదాపు 1000 మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు రెడీ అయింది. నిధుల కొరతతో సతమతం అవుతున్న దిగ్గజం పొదుపు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే వచ్చే నెలాఖరులోపు 15 శాతం మంది సిబ్బందిని ఇంటికి సాగనంపాలని భావిస్తున్నదని సమాచారం. 2023 మార్చి నెలాఖరు నాటికి మొత్తం 10,060 మంది ఉద్యోగులు స్పైస్ జెట్’లో పని చేస్తున్నారు. వారిలో 7,131 మంది శాశ్వత సిబ్బంది ఉన్నారు. సిబ్బంది క్రమబద్ధీకరణ వల్ల సంస్థ ఏటా రూ.100 కోట్లు ఆదా చేయగలుగుతుందని స్పైస్ జెట్ ఓ ప్రకటనలో తెలిపింది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)