SpiceJet Financial Crisis: ఆర్థిక సంక్షోభంలో స్పైస్ జెట్, 150 మంది క్రూ సిబ్బందికి మూడు నెలల పాటు వేతనం లేని సెలవులు మంజూరు
ఈ నేపథ్యంలో మూడు నెలల పాటు 150 మంది క్రూ సిబ్బందికి వేతనం లేని సెలవులు మంజూరు చేసింది. సెలవు ప్రకటించిన క్రూ సిబ్బంది స్పైస్ జెట్ ఉద్యోగులుగానే కొనసాగుతారని, వారి హెల్త్ బెనిఫిట్లు, ఎర్న్డ్ లీవ్స్ యధాతథంగా కొనసాగుతాయని ఓ ప్రకటనలో తెలిపింది.
దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ (Spice Jet) ఆర్థిక సమస్యలతో సతమతం అవుతోంది. ఈ నేపథ్యంలో మూడు నెలల పాటు 150 మంది క్రూ సిబ్బందికి వేతనం లేని సెలవులు మంజూరు చేసింది. సెలవు ప్రకటించిన క్రూ సిబ్బంది స్పైస్ జెట్ ఉద్యోగులుగానే కొనసాగుతారని, వారి హెల్త్ బెనిఫిట్లు, ఎర్న్డ్ లీవ్స్ యధాతథంగా కొనసాగుతాయని ఓ ప్రకటనలో తెలిపింది. నిధుల సమీకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రస్తుతం స్పైస్ జెట్ యాజమాన్యం విమాన సర్వీసుల నిర్వహణ తగ్గించేసింది. ప్రస్తుతం సుమారు 22 విమానాలు మాత్రమే నడుపుతున్నది. ఈ పరిస్థితుల మధ్య స్పైస్ జెట్ కార్యకలాపాలపై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిఘా పెంచుతున్నట్లు ప్రకటించింది. జియో యూజర్లకు 100 జీబీ ఉచిత స్టోరేజీ, కీలక ప్రకటన చేసిన ముఖేష్ అంబానీ, తక్కువ ధరకే ఏఐ మోడల్ సర్వీసులు అందిస్తామని వెల్లడి
Here's News