Sundar Pichai: భారత్‌కు రూ. 135 కోట్లు విరాళంగా ప్రకటించిన గూగుల్ సీఈఓ సుందర పిచాయ్, గివ్ ఇండియా ద్వారా యూనిసెఫ్‌కు అందనున్న విరాళం, వైద్య పరికరాలు, ఆక్సిజన్, ఆక్సిజన్ సంబంధిత ఉపకరణాలు కొనుగోలు చేసే అవకాశం
గూగుల్ ముఖ్యకార్యనిర్వహణాధికారి సుందర పిచాయ్.. భారత్‌కు 135 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆయన గివ్ ఇండియా (GivIndia)కు అందజేశారు.
దేశంలో కరోనా కల్లోలం రేపుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం గూగుల్ (google) తనవంతు సహకారాన్ని అందించింది. గూగుల్ ముఖ్యకార్యనిర్వహణాధికారి సుందర పిచాయ్.. భారత్‌కు 135 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆయన గివ్ ఇండియా (GivIndia)కు అందజేశారు. గివ్ ఇండియా ద్వారా యూనిసెఫ్‌కు ఈ విరాళం అందుతుంది. ఆ మొత్తంతో వైద్య పరికరాలు, ఆక్సిజన్, ఆక్సిజన్ సంబంధిత ఉపకరణాలను కొనుగోలు చేయడానికి వినియోగించే అవకాశాలు ఉన్నాయి.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరోనా పేషెంట్లకు యూనిసెఫ్ తరఫున అత్యవసర వైద్య సహాయం అందుతుంది. ఆ చర్యలను యూనిసెఫ్ పర్యవేక్షిస్తుంది. సుందర్ పిచాయ్‌ను స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని బహుళజాతి కంపెనీలు భారత్‌కు తమవంతు ఆర్థిక సహాయాన్ని అందించడానికి, విరాళాలను ప్రకటించడానికి ముందుకొస్తున్నారు.