TCS Layoffs: ఉద్యోగం ఊడిన వారికి గుడ్ న్యూస్, జాబ్‌ కోల్పోయిన ఉద్యోగుల్ని నియమించుకుంటామని తెలిపిన టీసీఎస్‌ చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ ఆఫీసర్‌, తమ ఉద్యోగుల్ని తొలగించడం లేదని ప్రకటన

ఈ నేపథ్యంలో టీసీఎస్‌ సైతం ఉద్యోగుల్ని తీసేస్తుందని నివేదికలు బయటకు వచ్చాయి. అయితే ఈ వార్తలన్ని టీసీఎస్‌ ఖండించింది.సంస్థలో చేరిన ఉద్యోగి ప్రతిభను తీర్చిదిద్దుతామే తప్పా.. ఉద్యోగుల్ని తొలగించడం లేదని స్పష్టం చేసింది.

Tata Consultancy Services. (Photo credits: PTI)

ఆర్ధిక మాద్యం ముంచుకొస్తుందన్న భయాలతో ప్రపంచ వ్యాప్తంగా టెక్ కంపెనీలు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో టీసీఎస్‌ సైతం ఉద్యోగుల్ని తీసేస్తుందని నివేదికలు బయటకు వచ్చాయి. అయితే ఈ వార్తలన్ని టీసీఎస్‌ ఖండించింది.సంస్థలో చేరిన ఉద్యోగి ప్రతిభను తీర్చిదిద్దుతామే తప్పా.. ఉద్యోగుల్ని తొలగించడం లేదని స్పష్టం చేసింది.

టీసీఎస్‌ చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ ఆఫీసర్‌ మిలింద్ ల‌క్క‌డ్ పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టార్టప్స్‌లో జాబ్‌ కోల్పోయిన ఉద్యోగుల్ని టీసీఎస్‌ నియమించుకునే ప్రణాళికల్లో ఉందని వ్యాఖ్యానించారు. తమ సంస్థలో ఒక్కసారి చేరితే ఉద్యోగుల నుంచి ప్రొడక్టివిటీ, ఉత్పత్తుల తయారీ గురించి మాత్రమే ఆలోచిస్తుందని, లేఆఫ్స్‌పై కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం టీసీఎస్‌లో మొత్తం 6 లక్షల మంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రతిఏడు ఉద్యోగులకు శాలరీలు ఎలా పెంచుతామో.. ఈ ఏడాది సైతం అలాగే పెంచుతామని మిలింద్‌ సూచించారు.

Here's Update