X No Longer To Be Free? ఎక్స్‌లో కొత్త వాళ్లు పోస్ట్ చేయాలంటే డబ్బులు చెల్లించాల్సిందే, సంచలన ప్రకటన చేసిన ఎలాన్ మస్క్

సోషల్ మీడియా ‘ఎక్స్‌’ (ట్విట్టర్) లో పోస్టులకు ఛార్జ్‌ చేయడానికి ఎలాన్‌ మస్క్ (Elon Musk) సిద్ధమయ్యారు. ఈ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌లో కొత్త యూజర్లు చేసే పోస్ట్‌కు చిన్న మొత్తంలో ఫీజు చెల్లించాల్సి రావొచ్చని ఎలాన్ వెల్లడించారు. ‘బాట్స్‌’ (bots) సమస్యను నివారించడానికి ఇది తప్పకపోవచ్చని సంకేతమిచ్చారు.‘

X Elon Musk (Photo Credits: Wikimedia Commons)

సోషల్ మీడియా ‘ఎక్స్‌’ (ట్విట్టర్) లో పోస్టులకు ఛార్జ్‌ చేయడానికి ఎలాన్‌ మస్క్ (Elon Musk) సిద్ధమయ్యారు. ఈ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌లో కొత్త యూజర్లు చేసే పోస్ట్‌కు చిన్న మొత్తంలో ఫీజు చెల్లించాల్సి రావొచ్చని ఎలాన్ వెల్లడించారు. ‘బాట్స్‌’ (bots) సమస్యను నివారించడానికి ఇది తప్పకపోవచ్చని సంకేతమిచ్చారు.‘ఎక్స్‌ డైలీ న్యూస్‌’ ఖాతా నుంచి వచ్చిన ఓ ప్రశ్నకు బదులిస్తూ మస్క్‌ సోమవారం మస్క్ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే మరొకరి ప్రశ్నకు బదులిస్తూ..కొత్త యూజర్లు ఫీజు చెల్లించకపోయినా ఎక్స్‌లో పోస్ట్‌ చేసేందుకూ అవకాశం ఇస్తామని తెలిపారు. అయితే అకౌంట్‌ క్రియేట్‌ చేసుకున్న తర్వాత కనీసం మూడు నెలలు వేచి చూడాలన్నారు.

ఈ కొత్త విధానం ఎప్పుడు అమల్లోకి వస్తుందనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. గతేడాది  న్యూజిలాండ్‌, ఫిలిప్పీన్స్‌లో కొత్త ఖాతాలకు ఏడాదికి డాలర్‌ ఛార్జీ వసూలు చేసే విధానాన్ని  ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు ఎక్స్ తెలిపింది.ఈ ప్రాంతాలకు చెందిన కొత్త యూజర్లు ఎక్స్‌లో పోస్ట్‌ను చూడగలరు. కానీ, రిప్లై, రీపోస్ట్‌, కొత్త పోస్ట్‌ రాయడం వంటి ఆప్షన్లు మాత్రం ఉండవు. దీన్నే ఇప్పుడు ఇతర ప్రాంతాలకూ విస్తరించే యోచనలో మస్క్‌ ఉన్నారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now