US: అమెరికాలో తీవ్ర విషాదం, గోల్డెన్‌ గేట్‌ బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఇండియన్‌ అమెరికన్‌, ఇప్పటివరకు ఆ బ్రిడ్జ్ మీద నుంచి 2వేల మంది ఆత్మహత్య

అమెరికాలోని భారత సంతతికి చెందిన యువకుడు శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రసిద్ధ గోల్డెన్‌ గేట్‌ బ్రిడ్జి పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వంతెనపై అతని సైకిల్, ఫోన్, బ్యాగ్ లభ్యమయ్యాయని అమెరికా కోస్టల్‌ గార్డ్స్‌ అధికారులు తెలిపారు

Representational Image (Photo Credits: ANI)

అమెరికాలోని భారత సంతతికి చెందిన యువకుడు శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రసిద్ధ గోల్డెన్‌ గేట్‌ బ్రిడ్జి పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వంతెనపై అతని సైకిల్, ఫోన్, బ్యాగ్ లభ్యమయ్యాయని అమెరికా కోస్టల్‌ గార్డ్స్‌ అధికారులు తెలిపారు. గోల్డెన్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ భారతీయ అమెరికన్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఇది నాలుగోసారని ఎన్నారై అజయ్ జైన్ భూటోరియా తెలిపారు. కాగా, 1937లో ప్రారంభమైన ఈ బ్రిడ్జిపై నుంచి ఇప్పటివరకు 2 వేల మంది ఆత్మహత్య చేసుకున్నారు. తరచూ ఇక్కడ ఆత్మహత్య కేసులు నమోదవుతుండటంతో వంతెనకు ఇరువైపులా 20 అడుగుల వెడల్పుతో ఇనుప మెష్‌ను అక్కడి ప్రభుత్వం నిర్మిస్తోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now