‘2024, Modi Once More’: 2024 మోదీ వన్స్ మోర్ నినాదాలు, వచ్చే ఎన్నికల్లో బీజేపీ నినాదం ఇదేనా.. బెర్లిన్‌లో సభా వేదికపైకి మోదీ వస్తున్న సమయంలో ట్వెంటీ ట్వెంటీ ఫోర్.. మోదీ వన్స్ మోర్ స్లోగన్స్
బెర్లిన్ లోని పాట్స్ డామర్ ప్లాట్జ్ థియేటర్ లో భారత సంతతి ప్రజలతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సభా వేదికపైకి మోదీ వస్తున్న సమయంలో ‘ట్వెంటీ ట్వెంటీ ఫోర్.. మోదీ వన్స్ మోర్’ అంటూ అక్కడికి వచ్చిన వారు నినాదాలతో హోరెత్తించారు. భారత కమ్యూనిటీ ప్రజలను ఉద్దేశించి గంట పాటు మోదీ ప్రసంగించారు.
బెర్లిన్ లోని పాట్స్ డామర్ ప్లాట్జ్ థియేటర్ లో భారత సంతతి ప్రజలతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సభా వేదికపైకి మోదీ వస్తున్న సమయంలో ‘ట్వెంటీ ట్వెంటీ ఫోర్.. మోదీ వన్స్ మోర్’ అంటూ అక్కడికి వచ్చిన వారు నినాదాలతో హోరెత్తించారు. భారత కమ్యూనిటీ ప్రజలను ఉద్దేశించి గంట పాటు మోదీ ప్రసంగించారు. కార్యక్రమం ఆసాంతం మోదీ.. మోదీ.. భారత్ మాతాకీ జై, మోదీ హై తో ముమ్ కిన్ హై, 2024 మోదీ వన్స్ మోర్.. నినాదాలతో థియేటర్ దద్దరిల్లిందనే చెప్పుకోవాలి. మోదీ స్పందిస్తూ.. ‘‘నా గురించి లేదా మోదీ సర్కారు గురించి మాట్లాడేందుకు నేను ఇక్కడకు రాలేదు. భారత చిన్నారులను జర్మనీలో కలుసుకునే అవకాశం నాకు లభించడం అదృష్టంగా భావిస్తున్నా’’అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)