US: యుఎస్‌లో 8 నెలల చిన్నారి సహా నలుగురు భారతీయులు కిడ్నాప్, అతను ప్రమాదకరమైనవాడని తెలిపిన పోలీసులు
అమెరికా కాలమానం ప్రకారం సోమవారం కాలిఫోర్నియాలోని మెర్సిడ్ కౌంటీ నుంచి వీరిని కిడ్నాప్ చేశారు.
యుఎస్‌లో ఎనిమిది నెలల చిన్నారి సహా నలుగురు భారతీయుల కిడ్నాప్ కలకలం సృష్టించింది. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం కాలిఫోర్నియాలోని మెర్సిడ్ కౌంటీ నుంచి వీరిని కిడ్నాప్ చేశారు. జస్దీప్ సింగ్ (36), జస్లీన్ కౌర్ (26) దంపతులు, వారి ఎనిమిది నెలల చిన్నారి అరూహి ధేరితో పాటు అమన్‌దీప్ సింగ్ (39) కూడా అపహరణకు గురి అయినట్టు మెర్సిడ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
వీళ్లను కిడ్నాప్ చేసిన నిందితుడి దగ్గర ఆయుధాలు ఉన్నాయని, అతను ప్రమాదకరమైనవాడని పోలీసులు వివరించారు. దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలో ఉన్నందున ఈ సంఘటన గురించి పూర్తి సమాచారం తెలియడం లేదు. అనుమానితుడు లేదా బాధితులు కనిపిస్తే నేరుగా వారి వద్దకు వెళ్లకుండా అత్యవసర నంబర్ 911కి ఫోన్ చేయాలని అధికారులు ప్రజలను కోరారు. కాగా, 2019లో తుషార్ అత్రే అనే భారత సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కాలిఫోర్నియా ఇంటి నుంచి కిడ్నాప్ అయినట్టు వార్తలు వచ్చిన కొన్ని గంటల తర్వాత తన స్నేహితురాలు కారులో విగతజీవిగా కనిపించాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)