Afghanistan: గడ్డం లేకుండా ఆఫీసుకు వస్తే ఉద్యోగంలో నుంచి పీకేస్తాం, కొత్త రూల్ తీసుకువచ్చిన తాలిబన్లు, ఎవరూ షేవింగ్ చేసుకోవద్దని హెచ్చరికలు
తమ దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులంతా గడ్డం పెంచుకోవాలని ఆదేశించింది. అలాగే విదేశీ వస్త్రాలు ధరించొద్దని, స్థానికంగా ఉండే దుస్తులో వేసుకోవాలని చెప్పింది.
అమెరికా అర్ధంతరంగా తమ సైన్యాలను వెనక్కు తీసుకెళ్లిపోవడంతో.. తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు రోజుకో కొత్త రూల్ తీసుకొస్తున్నారు. ఇటీవలే అమ్మాయిలకు హైస్కూల్ తలుపులు తెరిచినట్లే తెరిచి, మూసేసిన తాలిబన్ ప్రభుత్వం ఇప్పుడు మరో కఠిన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులంతా గడ్డం పెంచుకోవాలని ఆదేశించింది. అలాగే విదేశీ వస్త్రాలు ధరించొద్దని, స్థానికంగా ఉండే దుస్తులో వేసుకోవాలని చెప్పింది.
ఆఫ్ఘన్‌లో దొరికే పొడవాటి లూజు చొక్కా, ప్యాంటు వేసుకొని, గడ్డం పెంచుకొని, తలపై టోపీ లేదా తలపాగా పెట్టుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పబ్లిక్ మోరాలిటీ మంత్రిత్వ శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. తాము నిర్దేశించిన రూల్స్ ఎవరైనా సరే పాటించకపోతే వారిని ఆఫీసుల్లోకి రానివ్వబోమని స్పష్టం చేసింది. ఇదే తప్పును రిపీట్ చేస్తే సదరు వ్యక్తులను ఉద్యోగాల్లోకి తొలగిస్తామని హెచ్చరించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)