Alien Dead Bodies Found: ఏలియన్స్ డెడ్ బాడీలు వీడియోలు ఇవిగో, మెక్సికో దేశ చట్టసభలో అవశేషాలను ప్రదర్శించిన సభ్యులు
మెక్సికో దేశ చట్టసభలో ఏలియన్ అవశేషాలను (Alien fossils) ప్రదర్శించారు. మంగళవారం రెండు గాజు పెట్టెల్లో ఉన్న ఏలియన్స్ అవశేషాలను మెక్సికో కాంగ్రెస్‌లో ప్రదర్శించారు. జర్నలిస్ట్, యూఫోలజిస్ట్ జైమ్ మౌసాన్ ఈ బాక్సులను తెరిచి చూపించారు.
మెక్సికో దేశ చట్టసభలో ఏలియన్ అవశేషాలను (Alien fossils) ప్రదర్శించారు. మంగళవారం రెండు గాజు పెట్టెల్లో ఉన్న ఏలియన్స్ అవశేషాలను మెక్సికో కాంగ్రెస్‌లో ప్రదర్శించారు. జర్నలిస్ట్, యూఫోలజిస్ట్ జైమ్ మౌసాన్ ఈ బాక్సులను తెరిచి చూపించారు. అమెరికన్స్ ఫర్ సేఫ్ ఏరోస్పేస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రియాన్ గ్రేవ్స్, అమెరికా నేవీ మాజీ పైలట్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ ఘటన గ్రహాంతర జీవుల ఉనికి గురించి చర్చకు దారితీసింది.
ఈ రెండు గ్రహాంతర జీవుల శిలాజ అవశేషాలను వేల ఏండ్ల కిందట పెరూలోని కుస్కో నుంచి వెలికితీసినట్టు మౌసాన్ తెలిపారు. ఇవి మన భూగోళానికి చెందినవి కావని అన్నారు. అలాగే గుర్తు తెలియని ఎగిరే వస్తువు ( UFO) శిథిలాల నుంచి కనుగొన్న జీవులు కూడా కాదని స్పష్టం చేశారు. డయాటమ్ (ఆల్గే) గునుల్లో బయటపడిన శిలాజ అవశేషాలని చెప్పారు. మెక్సికో కాంగ్రెస్‌లో ప్రదర్శించిన ఏలియన్ అవశేషాల వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.వీడియో ఇదిగో..
Here's Videos