Indian-Origin Motel Manager Killed in US: వీడియో ఇదిగో, అమెరికాలో మరో భారతీయుడు దారుణ హత్య, పాయింట్ బ్లాంక్‌లో భారత వ్యాపారిని గన్‌తో తలపై కాల్చి చంపిన దుండగుడు
అమెరికాలోని పెన్సిల్వేనియాలో భారత సంతతి వ్యాపారి రాకేశ్ ఎహగబన్ (51) దారుణ హత్యకు గురయ్యారు. పిట్స్‌బర్గ్‌లోని రాబిన్సన్ టౌన్‌షిప్‌లో మోటెల్ నిర్వాహకుడిగా పనిచేస్తున్న ఆయన శుక్రవారం సాయంత్రం మోటెల్ బయట జరిగిన గొడవను ఆపడానికి వెళ్లిన సమయంలో నిందితుడు కాల్పులు జరిపి ప్రాణాలు తీసేశాడు.
అమెరికాలోని పెన్సిల్వేనియాలో భారత సంతతి వ్యాపారి రాకేశ్ ఎహగబన్ (51) దారుణ హత్యకు గురయ్యారు. పిట్స్‌బర్గ్‌లోని రాబిన్సన్ టౌన్‌షిప్‌లో మోటెల్ నిర్వాహకుడిగా పనిచేస్తున్న ఆయన శుక్రవారం సాయంత్రం మోటెల్ బయట జరిగిన గొడవను ఆపడానికి వెళ్లిన సమయంలో నిందితుడు కాల్పులు జరిపి ప్రాణాలు తీసేశాడు. గొడవ ఎందుకు జరుగుతున్నదో తెలుసుకోవడానికి రాకేష్ అడిగినపుడు, నిందితుడు తన వద్ద ఉన్న తుపాకీతో పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో ఆయనపై కాల్చాడు. ఈ ఘటనతో రాకేశ్ అక్కడికక్కడే మృతి చెందారు. మొత్తం సంఘటన మోటెల్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి వ్యక్తి స్టాన్లీ యుజెన్ వెస్ట్ (37)గా గుర్తించారు. అతడు కాల్పుల తర్వాత మోటెల్ నుండి పరారయ్యాడు. పోలీసులు అతడిని పిట్స్‌బర్గ్‌లోని ఈస్ట్ హిల్స్ ప్రాంతంలో పట్టుకున్నారు. ఈ సమయంలో నిందితుడు పోలీసులపై కూడా కాల్పులు జరిపాడు. పోలీసుల ఎదురుదాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.అతనిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.పోలీసుల వివరాల ప్రకారం, యుజెన్ వెస్ట్ గత రెండు వారాలుగా రాకేశ్ నిర్వహిస్తున్న మోటెల్‌లో అద్దెకు ఉంటున్నాడు. నిందితుడిపై హత్య, హత్యాయత్నం, ఆయుధ చట్ట ఉల్లంఘన వంటి అభియోగాలు మోపారు. పోలీసులు ఇంకా సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Indian-Origin Motel Manager Killed in US Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)