Massacre in Nigeria: నైజీరియాలో దారుణం, సాయుధ మూకలు జరిపిన కాల్పుల్లో 160 మంది మృతి, 300 మందికి పైగా గాయాలు
మధ్య నైజీరియాలోని పలు గ్రామాల ప్రజలే లక్ష్యంగా ‘బండిట్స్’గా పిలిచే సాయుధ సమూహాలు కాల్పులతో నరమేధాన్ని సృష్టించాయి. ఈ వరుస కాల్పుల్లో 160 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టుగా స్థానిక ప్రభుత్వం ప్రకటించింది.
సాయుధ మూకల అరాచక దాడుల మధ్య నైజీరియాలో మరో దారుణం చోటు చేసుకుంది. మధ్య నైజీరియాలోని పలు గ్రామాల ప్రజలే లక్ష్యంగా ‘బండిట్స్’గా పిలిచే సాయుధ సమూహాలు కాల్పులతో నరమేధాన్ని సృష్టించాయి. ఈ వరుస కాల్పుల్లో 160 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టుగా స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో 16 మంది చనిపోయినట్టుగా మొదట వార్తలు వచ్చాయి.
అయితే సోమవారం కూడా ఈ కాల్పులు కొనసాగడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. దాడుల్లో గాయపడిన దాదాపు 300 మందికి పైగా బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని స్థానిక అధికారులు వెల్లడించారు.కొన్ని తెగలకు చెందిన ప్రజలే లక్ష్యంగా సాయుధ మూకలు మారణకాండకు పాల్పడ్డాయని, ఇళ్లలోకి చొరబడి ప్రజలను చిత్రహింసలకు గురిచేశారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.కాగా మధ్య నైజీరియా కొన్నేళ్లుగా ఈ తరహా దాడులతో వణికిపోతోంది.
Here's Disturbed Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)