Moscow-Goa Flight Bomb Threat: విమానానికి బాంబు బెదిరింపు కాల్, వేగంగా స్పందించిన భారత వాయుసేన, సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ

మాస్కో (Moscow) నుంచి గోవా (Goa)కు బయల్దేరిన విమానానికి బాంబు బెదిరింపు కారణంగా గుజరాత్‌ (Gujarat)లో అత్యవసరంగా ల్యాండ్‌ అయిన విషయం తెలిసిందే.విమానంలో 236 మంది ప్రయాణికుల ప్రాణాలు ఈ బెదిరింపు కాల్‌తో ప్రమాదంలో పడ్డాయి.

Flight (Representative image)

మాస్కో (Moscow) నుంచి గోవా (Goa)కు బయల్దేరిన విమానానికి బాంబు బెదిరింపు కారణంగా గుజరాత్‌ (Gujarat)లో అత్యవసరంగా ల్యాండ్‌ అయిన విషయం తెలిసిందే.విమానంలో 236 మంది ప్రయాణికుల ప్రాణాలు ఈ బెదిరింపు కాల్‌తో ప్రమాదంలో పడ్డాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో భారత వాయుసేన (IAF)వేగంగా స్పందించి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది.

అజూర్‌ ఎయిర్‌ విమానంలో బాంబు ఉందంటూ సమాచారం రాగానే రష్యన్‌ ఎంబసీ.. భారత అధికారులను అప్రమత్తం చేసింది. వెంటనే భారత వాయుసేన అప్రమత్తమై జామ్‌నగర్‌ (Jamnagar) ఎయిర్‌పోర్టులో భద్రతా ప్రొటోకాల్స్‌ను యాక్టివేట్‌ చేసింది.విమానం దిగగానే ఐఏఎఫ్‌ (IAF) సిబ్బంది మొదట ప్రయాణికులను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎయిర్‌ కమాండర్‌ ఆనంద్ సోంధీ నేతృత్వంలోని ఐఏఎఫ్‌ అధికారుల బృందం.. ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు.

కొన్ని గంటల పాటు జరిపిన ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో బాంబు బెదిరింపు ఉత్తుత్తిదేనని తేలింది. దీంతో అటు ప్రయాణికులు, ఇటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అలా దాదాపు 15 గంటల తర్వాత మాస్కో విమానం.. గోవా (Goa)లోని గమ్యస్థానానికి బయల్దేరింది.

Here's ANI Tweets

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)