Viral Videos: కొసావో పార్లమెంటులో కుమ్మేసుకున్న చట్టసభ్యులు.. ప్రధాని ప్రసంగిస్తుండగా ముఖంపై నీళ్లు చల్లిన ప్రతిపక్ష నేత.. వీడియో ఇదిగో!

పార్లమెంట్ లో చట్టసభ సభ్యులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ, తోసుకుంటూ కుమ్మేసుకున్నారు.

Credits: Twitter

Newdelhi, July 14: ఆగ్నేయ ఐరోపా దేశమైన కొసావో పార్లమెంటు (Kosovo Parliament) రణరంగంగా మారిపోయింది. పార్లమెంట్ లో (Parliament) చట్టసభ సభ్యులు (Lawmakers) ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ, తోసుకుంటూ కుమ్మేసుకున్నారు. ప్రధానమంత్రి అల్బిన్ కుర్తీ మాట్లాడుతుండగా ప్రతిపక్ష సభ్యుడు లేచొచ్చి వాటర్ బాటిల్‌ తో ఆయన ముఖంపై నీళ్లు చల్లారు. అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించే క్రమంలో అందరూ ముష్టిఘాతాలు కురిపించుకుంటూ కొట్టుకున్నారు. వారికి మహిళా సభ్యులు కూడా తోడయ్యారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కుర్తీ విధానాలు పాశ్చాత్య మిత్రులతో సంబంధాలు దెబ్బతీసేలా ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఆయనపై దాడికి ఇదే కారణంగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Bigg Boss 7 Telugu: బిగ్ ‏బాస్ సీజన్ 7 తెలుగు కంటెస్టెంట్స్ అదుర్స్.. లిస్ట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు.. షోలో ఈసారి ఎవరు ఉన్నారో మీరూ చూడండి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)