Brazil President Bolsonaro: కడుపులో పేగుకు సంబంధించిన సమస్యతో ఆస్పత్రి పాలైన బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, స్థిరంగా ఆయన ఆరోగ్యం

బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో అస్వస్థతకు గురై సోమవారం ఆస్పత్రిలో చేరారు. కడుపులో పేగుకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చేరినట్లు ట్వీటర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని, పేగుకు శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్లు వెల్లడించారు.

Brazil President Jair Bolsonaro (Photo-insta)

బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో అస్వస్థతకు గురై సోమవారం ఆస్పత్రిలో చేరారు. కడుపులో పేగుకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చేరినట్లు ట్వీటర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని, పేగుకు శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్లు వెల్లడించారు. 66 ఏళ్ల జైర్ బోల్సోనారో 2018 అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో కత్తిపోటుకు గురైనప్పటి నుంచి పలుమార్లు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే కరోనా టైంలో బోల్సోనారో నిర్ణయాల వల్ల బ్రెజిల్‌ తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. మాస్క్‌ అక్కర్లేదంటూ, వ్యాక్సినేషన్‌ వద్దంటూ నిర్ణయాలు తీసుకుని విమర్శలపాలయ్యాడు. తద్వారా బ్రెజిల్‌లో లక్షల్లో కరోనా మరణాలు సంభవించగా.. బోల్సోనారో తీరును వ్యతిరేకిస్తూ జనాలు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేయడం ప్రపంచం మొత్తం వీక్షించింది. ఈ తరుణంలో బోల్సోనారో కోలుకోవద్దంటూ పలువురు సోషల్‌ మీడియాలో పలువురు కోరుతూ ఆయనకు షాక్ ఇస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now