Brazil Flash Floods: భారీ వర్షాలకు 56 మంది మృతి, ఈశాన్య బ్రెజిల్‌లో కుండపోత వర్షాలు, పొంగి పొర్లుతున్న నదులు

ఈశాన్య బ్రెజిల్‌లో కుండపోత వర్షాల వల్ల 56 మంది మరణించారు. భారీ వర్షాల బీభత్సం వల్ల మరో 44 మంది తప్పిపోయారని బ్రెజిల్ ప్రభుత్వం తెలిపింది. భారీవర్షాల వల్ల మరో 25 మంది గాయపడ్డారని, భారీ విపత్తు వల్ల 3,957 మంది ఆశ్రయం కోల్పోయారని అని ప్రాంతీయ అభివృద్ధి మంత్రి డేనియల్ ఫెరీరా చెప్పారు.

Representational Image. (Photo Credits: IANS)

ఈశాన్య బ్రెజిల్‌లో కుండపోత వర్షాల వల్ల 56 మంది మరణించారు. భారీ వర్షాల బీభత్సం వల్ల మరో 44 మంది తప్పిపోయారని బ్రెజిల్ ప్రభుత్వం తెలిపింది. భారీవర్షాల వల్ల మరో 25 మంది గాయపడ్డారని, భారీ విపత్తు వల్ల 3,957 మంది ఆశ్రయం కోల్పోయారని అని ప్రాంతీయ అభివృద్ధి మంత్రి డేనియల్ ఫెరీరా చెప్పారు. తీవ్రంగా దెబ్బతిన్న ఈశాన్య పెర్నాంబుకో రాష్ట్ర రాజధాని రెసిఫేలో బ్రెజిల్ మంత్రి డేనియల్ పర్యటించారు.కాగా బ్రెజిల్‌లో ఇటీవల కొండచరియలు విరిగిపడటంతోపాటు వరదలు సంభవించాయి. భారీ వర్షాల కారణంగా బ్రెజిల్ దేశంలోని నదులు పొంగి ప్రవహించాయి. దాదాపు 1,200 మంది సిబ్బంది రెస్క్యూ పనిని ప్రారంభించారు. గత సంవత్సరం కుండపోతగా కురిసిన వర్షాల వల్ల సంభవించిన వరదల వల్ల వందలాది మంది బ్రెజిలియన్లు మరణించారు.గత నెల ప్రారంభంలో రాష్ట్రంలో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మరో 14 మంది మరణించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement