Cigarette Butt: సిగిరెట్ తాగి పీక రోడ్డు మీద పడేశాడని రూ. 50 వేలు జరిమానా విధించిన లండన్ కోర్టు, రోడ్లన్నీ చెత్తాచెదారంగా తయారవుతున్నాయని తెలిపిన న్యాయమూర్తి
రోడ్డుమీద సిగరెట్ పీక పడేసిన ఏకంగా రూ.55వేలు (558 పౌండ్లు) జరిమానా విధించింది లండన్ కోర్టు. ఈ ఘటన ఇంగ్లాండ్‌లోని థోర్న్ బరీ టౌన్‌లో చోటు చేసుకుంది. అలెక్స్ డేవిస్ అనే వ్యక్తి.. సిగరెట్ తాగి దాని పీకను రోడ్డుపై పడేశాడు.
రోడ్డుమీద సిగరెట్ పీక పడేసిన ఏకంగా రూ.55వేలు (558 పౌండ్లు) జరిమానా విధించింది లండన్ కోర్టు. ఈ ఘటన ఇంగ్లాండ్‌లోని థోర్న్ బరీ టౌన్‌లో చోటు చేసుకుంది. అలెక్స్ డేవిస్ అనే వ్యక్తి.. సిగరెట్ తాగి దాని పీకను రోడ్డుపై పడేశాడు. దీన్ని గమనించిన స్ట్రీట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అలెక్స్‌కు రూ.15 వేలు (150 పౌండ్లు) జరిమానా విధించారు.
ఆ మొత్తం వెంటనే కట్టాలని ఆదేశించారు. అయితే, అధికారుల ఆదేశాలను అతను లెక్కచేయలేదు. దీంతో ఆగ్రహించిన అధికారులు అలెక్స్‌పై కేసు నమోదు చేసి.. కోర్టులో ప్రవేశపెట్టారు.కేసు విచారించిన న్యాయమూర్తి.. అలెక్స్‌కు రూ.55 వేలు జరిమానా విధించారు. సిగరెట్ తాగి పీకను ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్ల రోడ్లన్నీ చెత్తాచెదారంగా తయారవుతాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
Here's NDtv Tweet