Canadian Woman Dies: ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకున్న కెనడా వాసి మృతి, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టడంతో మరణం, అధికారికంగా వెల్లడించిన కెనడా చీఫ్ మెడికల్ ఆఫీసర్
ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌కు సంబంధించినంత వరకు కెనడాలో ఇదే తొలి మరణం. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టడంతో కెనడాలోని అల్బెర్టాకు చెందిన వ్యక్తి మృతి చెందాడు.
యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనికా సంయుక్తంగా ఉత్పత్తి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఓ కెనడా వ్యక్తి మరణించాడు. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌కు సంబంధించినంత వరకు కెనడాలో ఇదే తొలి మరణం. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టడంతో కెనడాలోని అల్బెర్టాకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఈ విషయాన్ని కెనడా చీఫ్ మెడికల్ ఆఫీసర్ వెల్లడించారు. కెనడాలో ఇప్పటివరకు 2.5 లక్షల ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ డోస్‌లను ఉపయోగించగా, ఇదే తొలి మరణమని ఆయన వ్యాఖ్యానించారు. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ను భారత్‌లో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ `కోవిషీల్డ్` పేరుతో ఉత్పత్తి చేస్తోంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)