China: తల్లీ కొడుతుందని భయంతో ఐదో అంతస్తు నుంచి దూకిన బాలుడు, తీవ్రగాయాలతో ఆస్పత్రికి..

తల్లి కొడుతుందని భయంతో ఎయిర్‌ కండీషనర్‌ పైకి వెళ్లిన బాలుడు ఐదో అంతస్తు నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడిన ఘటన చైనాలో చోటు చేసుకుంది.జూన్‌ 25న తూర్పు చైనాలో ఒక ఆరేళ్ల బాలుడు తల్లి కర్రతో కొడుతుందని భయంతో ఎయిర్‌ కండీషనర్‌ పైకి వెళ్లాడు.

Boy Jumps 5 Floors

తల్లి కొడుతుందని భయంతో ఎయిర్‌ కండీషనర్‌ పైకి వెళ్లిన బాలుడు ఐదో అంతస్తు నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడిన ఘటన చైనాలో చోటు చేసుకుంది.జూన్‌ 25న తూర్పు చైనాలో ఒక ఆరేళ్ల బాలుడు తల్లి కర్రతో కొడుతుందని భయంతో ఎయిర్‌ కండీషనర్‌ పైకి వెళ్లాడు. పడిపోతావని తల్లి వద్దని వారించినా భయంతో ఐదో అంతస్తు నుంచి దూకాడు. కిందపడిన బాలుడిని హూటాహుటిన ఆసుపత్రికి తరలించారు. శరీరంలో ఎముకలు విరిగినట్లు డాక్టర్లు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను చైనాలో 10 మిలియన్ల మంది వీక్షించారు. వీడియో సోషల్‌మీడియాలో రావడంతో నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

Boy Jumps 5 Floors
Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement