China Fire: చైనాలో ఘోర అగ్ని ప్రమాదం, 39 మంది మంటల్లో సజీవ దహనం, మరో 9 మందికి తీవ్ర గాయాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లో ఒక్కసారిగా ఎగసిన మంటలు

మ‌రో 9 మంది తీవ్ర గాయాల పాల‌య్యారు. ఈ ఘ‌ట‌న బుధ‌వారం మ‌ధ్యాహ్నం 3:24 గంట‌ల ప్రాంతంలో చోటు చేసుకుంది.స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేసింది

Fire (Representational Image; Photo Credit: IANS)

చైనాలో జియాంగ్జిలోని సెంట్ర‌ల్ చైనీస్ ప్రావిన్స్‌లో సంభ‌వించిన అగ్నిప్ర‌మాదంలో 39 మంది మృతి చెందారు. మ‌రో 9 మంది తీవ్ర గాయాల పాల‌య్యారు. ఈ ఘ‌ట‌న బుధ‌వారం మ‌ధ్యాహ్నం 3:24 గంట‌ల ప్రాంతంలో చోటు చేసుకుంది.స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేసింది. ఓ స్టోర్‌లో షాపింగ్ కాంప్లెక్స్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో మంట‌లు చెల‌రేగిన‌ట్లు పోలీసులు తెలిపారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నామ‌ని, క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు పేర్కొన్నారు. అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న నుంచి 120 మందిని ప్రాణాల‌తో కాపాడిన‌ట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. చైనాలో అర్ధరాత్రి భారీ భూకంపం, దేశ రాజధాని ఢిల్లీని తాకిన ప్రకంపనలు, భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టిన ప్రజలు

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)