IPL Auction 2025 Live

Cholera Outbreak in Zimbabwe: జింబాబ్వేని వణికిస్తున్న కలరా, వారానికి 500కు పైగా కొత్త కేసులు నమోదు, ఇప్పటి వరకు 152 మంది మృతి

ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 152 మంది మరణించారని, 8,087 అనుమానిత కలరా కేసులు, 1,241 నిర్ధారిత కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Cholera Representative Image

ఆఫ్రికా ఖండంలోని జింబాబ్వేలో కలరా తీవ్ర రూపం దాల్చింది. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 152 మంది మరణించారని, 8,087 అనుమానిత కలరా కేసులు, 1,241 నిర్ధారిత కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రెడ్‌ క్రాస్‌, రెడ్‌ క్రెసెంట్‌ సొసైటీల అంతర్జాతీయ సమాఖ్య తెలిపిన వివరాల ప్రకారం, అక్టోబరు నుంచి వారానికి 500కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కాగా కలుషిత ఆహారం, నీరు తీసుకోవడం వల్ల కలరా సంక్రమిస్తుంది. సరైన సమయంలో చికిత్స అందకపోతే, కొద్ది గంటల్లోనే రోగి మరణిస్తాడు. సకాలంలో గుర్తిస్తే సులభంగా చికిత్స చేయవచ్చు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)