Congo Boat Capsize: కాంగోలో ఘోర ప్రమాదం, లులోంగా నదిలో 200 మంది జలసమాధి, ఓవర్ లోడుతో బోటులో వెళ్తుండగా ఒక్కసారిగా మునిగిపోయిన బోటు

లులోంగా నదిలో 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న మోటారు బోటు ఓవర్ లోడుతో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 145 మంది చనిపోయి ఉంటారని అధికారులు తెలిపారు.

Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

వాయవ్య డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో(డీఆర్‌సీ) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లులోంగా నదిలో 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న మోటారు బోటు ఓవర్ లోడుతో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 145 మంది చనిపోయి ఉంటారని అధికారులు తెలిపారు. మిగతా 55 మంది సురక్షితంగా ప్రాణాలతో బయపడినట్లు అధికారులు వెల్లడించారు. రిపబ్లిక్ ఆఫ్ కాంగో వెళ్తుండగా బసన్‌కుసు పట్టణం సమీపంలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడం, వారితో పాటు వస్తువులు, పశువులు ఉండటంతో బరువు ఎక్కువై పడవ నదిలో మునిగిపోయింది.కాగా డీఆర్‌సీలో తరచూ పడవ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ రోడ్డు మార్గాలు లేకపోవడంతో ప్రజలు పడవల్లోనే ప్రయాణిస్తున్నారు. వలసదారులు బతుకుదెరవు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు.గతేడాది అక్టోబర్‌లోనూ కాంగో నదిలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. పడవ మునిగి 40 మంది చనిపోయారు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)