PM Modi at COP28 Summit: 2028లో భారత్‌లో COP33 సమావేశం, వరల్డ్ క్లైమేట్ యాక్షన్ కీలక శిఖరాగ్ర సమావేశంలో ప్రతిపాదించిన ప్రధాని మోదీ

కాగా 2028లో భారతదేశంలో COP33కి ఆతిథ్యం ఇవ్వాలని PM నరేంద్ర మోడీ ప్రతిపాదించారు.ఎన్‌డిసి లక్ష్యాలను సాధించే మార్గంలో ఉన్న ప్రపంచంలోని కొన్ని ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటని కూడా సదస్సు సందర్భంగా ప్రధాని అన్నారు

PM Modi at COP28 Summit (photo-ANI)

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా జరుగుతున్న వరల్డ్ క్లైమేట్ యాక్షన్ కీలక శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు దుబాయ్‌కు వెళ్లిన సంగతి విదితమే. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో వారికి సహాయపడేందుకు తగిన వాతావరణ ఫైనాన్సింగ్, సాంకేతికత బదిలీతో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.

దుబాయ్‌లో COP28 సమ్మిట్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రపంచ వాతావరణ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..గత 11 ఏళ్లలో కాలుష్య ఉద్గారాలు తగ్గించడంలో భారత్ విజయం సాధించిందని తెలిపారు. కాగా 2028లో భారతదేశంలో COP33కి ఆతిథ్యం ఇవ్వాలని PM నరేంద్ర మోడీ ప్రతిపాదించారు.ఎన్‌డిసి లక్ష్యాలను సాధించే మార్గంలో ఉన్న ప్రపంచంలోని కొన్ని ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటని కూడా సదస్సు సందర్భంగా ప్రధాని అన్నారు

Here's News