Coronavirus Fifth Wave: కరోనావైరస్ పిఫ్త్ వేవ్ ముంచుకొస్తోంది, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన ఫ్రెంచ్ ఆరోగ్యమంత్రి ఆలివర్ వెరాన్
ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని ఫ్రెంచ్ ఆరోగ్యమంత్రి ఆలివర్ వెరాన్ హెచ్చరించారు.
ఫ్రాన్స్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్ ఐదో దశ (Coronavirus Fifth Wave) దేశంలో త్వరలో ప్రారంభం కావొచ్చునని.. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని ఫ్రెంచ్ ఆరోగ్యమంత్రి ఆలివర్ వెరాన్ హెచ్చరించారు. ఇది గతంలో వాటికంటే ప్రమాదకరమైందని, దాని నివారించడానికి ఉన్న ఏకైక మార్గం కొవిడ్ ప్రోటోకాల్స్‌ను పాటించడమేనన్నారు. దేశంలో కరోనా మహమ్మారి విధ్వంసం ఇంకా ముగియలేదని, కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని వెరాన్ సూచించారు. తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అక్టోబర్ మధ్య నుంచి దేశంలో కరోనా కేసులు నిరంతరంగా పెరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. టీకాలు, మాస్క్‌లు, పరిశుభ్రతతో ఐదో వేవ్‌ను మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలమని ఆలివర్ అన్నారు. ఫ్రాన్స్ వ్యాప్తంగా బుధవారం 11,883 కొత్త కేసులు నమోదయ్యాయి. 10వేలకుపైగా కొవిడ్ కేసులు నమోదవడం వరుసగా రెండోరోజు. ఇప్పటి వరకు 73.46లక్షల మంది మహమ్మారి బారిన పడగా.. వైరస్ బారినపడి 1.19లక్షల మందికిపైగా మృత్యువాతపడ్డారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)