COVID in China: చైనాలో కరోనా ఆంక్షలు చూస్తే నోరెళ్ళబెట్టాల్సిందే, ఒక్క పాజిటివ్ కేసు వచ్చినా ఊరంతా ఇనుప బాక్సుల్లో బందీ, 2 కోట్ల మంది చైనీయులు ఈ బాక్సుల్లోనే క్వారంటైన్‌లో...

బయటకు వచ్చిన ఈ వీడియో ప్రకారం చాలా ప్రాంతాల్లో క్వారంటైన్ క్యాంపులను తాత్కాలికంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రైలు పెట్టెల మాదిరిగా ఇనుప బాక్సులతో చిన్నపాటి గదులను నిర్మించింది.

People Forced To Live In Metal Boxes Under China's Zero Covid Rule (Photo-Songpinganq Twitter)

చైనా కరోనావైరస్ రూల్స్ ని ఎంత కఠినంగా అమలు చేస్తుందో తాజాగా ఓ వీడియో బయటకు వచ్చింది. బయటకు వచ్చిన ఈ వీడియో ప్రకారం చాలా ప్రాంతాల్లో క్వారంటైన్ క్యాంపులను తాత్కాలికంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రైలు పెట్టెల మాదిరిగా ఇనుప బాక్సులతో చిన్నపాటి గదులను నిర్మించింది. ఊర్లో ఒక్క పాజిటివ్ కేసు వచ్చినా.. ఊరు మొత్తం ఇనుపు బాక్సుల్లో రెండు వారాల పాటు క్వారంటైన్ కావాల్సిందే. పిల్లలు, గర్భిణులు, వృద్ధులనే తేడా లేదు. అందరినీ తీసుకెళ్లి క్వారంటైన్ బాక్సుల్లోకి నెట్టేస్తున్నారు.

ఇప్పుడు 2 కోట్ల మంది చైనీయులు ఈ బాక్సుల్లోనే క్వారంటైన్ అయి ఉన్నారు. జీరో కోవిడ్ పాలసీని చైనా కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. కొన్ని గ్రామాల్లో అయితే అర్ధరాత్రి వచ్చి నిద్రలేపి నిమిషాల్లో క్వారంటైన్ కేంద్రాలకు తరలి రావాలని హుకుం జారీ చేస్తున్నారు. బస్సుల్లో వారిని తరలిస్తున్నారు. ట్రాక్, ట్రేసెస్ యాప్స్ ను అధికారులు వినియోగిస్తున్నారు. ఇనుప బాక్సులో ఒక బెడ్, ఒక టాయిలెట్ మాత్రమే ఉంటుంది. మరో నెల రోజుల్లో బీజింగ్ ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వనుండడం కూడా అక్కడి సర్కారు కరోనాపై కఠినంగా వ్యవహరించేలా చేస్తోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)