COVID Hits North Korea: కిమ్ రాజ్యంలో కరోనా కల్లోలం, ఆరుమంది మృతి, గృహ నిర్భంధంలో లక్షా 87 వేల మంది పౌరులు

కిమ్‌ రాజ్యంలో కరోనా కల్లోలం రేపుతోంది. రాజధాని ప్యాంగాంగ్‌లో జర్వంతో మొత్తం ఆరుగురు మరణించారని, వారిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. మృతుడిలో ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బీఏ.2ను గుర్తించినట్లు పేర్కొన్నది.

File image of North Korea Dictator Kim Jong-un | Image Courtesy: Facebook

కిమ్‌ రాజ్యంలో కరోనా కల్లోలం రేపుతోంది. రాజధాని ప్యాంగాంగ్‌లో జర్వంతో మొత్తం ఆరుగురు మరణించారని, వారిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. మృతుడిలో ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బీఏ.2ను గుర్తించినట్లు పేర్కొన్నది. దేశంలో 18 వేల మంది జ్వరంతో బాధపడుతున్నారని మే 12న అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఆ సంఖ్య 1,87,800కు చేరిందని.. ప్రస్తుతం వారంతా ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు.

కాగా, వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి కిమ్‌ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి, లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. 2020 నుంచి ఈ ఏడాది మే 11 వరకు ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదవలేదని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. ఉత్తర కొరియన్లు ఇప్పటివరకు కరోనా టీకా తీసుకోలేదు. టీకాలు అందిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో, రష్యా, చైనా ప్రకటించినప్పటికీ.. కిమ్‌ తిరస్కరించారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement