COVID-19 in China: దారుణ వీడియోలు బయటకు.. చైనాలో కరోనా ఆకలి కేకలు, తినడానికి ఏమీ లేదు చంపేయండంటూ ప్రజల ఆర్తనాదాలు, కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు
రోజుల తరబడి కొనసాగుతున్న లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన జనం ఆహారం, నిత్యావసర వస్తువులు నిండుకొని ఆకలితో అలమటించిపోతున్నారు.
కరోనా తీవ్రతతో అల్లాడిపోతున్న చైనాలోని షాంగైలో ఇప్పటికే పరిస్థితులు విషమించాయి. రోజుల తరబడి కొనసాగుతున్న లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన జనం ఆహారం, నిత్యావసర వస్తువులు నిండుకొని ఆకలితో అలమటించిపోతున్నారు. తినడానికి ఏమీ లేదు ఆదుకోవాలంటూ ఇళ్లలోని బాల్కానీలు, కిటికీల్లోంచి అరుపులు, కేకలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. షాంగైలో అధికారులు సరఫరా చేస్తున్న ఆహార పదార్ధాలు సరిపోకపోవడంతో జనం ఆంక్షలను పట్టించుకోకుండా రోడ్ల మీదకు వస్తున్నారు.. అక్కడక్కడా షాపుల లూటీలు జరుగుతున్నాయి.
ఈ పరిస్థితులను ఆదుపు చేసేందుకు మరింత కఠినగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యవసర సర్వీసులు మినహా ఎవరూ రోడ్ల మీదకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. పోలీసులు అయితే చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. దొరికిన వారిని దొరికినట్లు చితకబాదుతున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.