Covid Scare in China: చైనాలో కరోనాపై షాకింగ్ వీడియో, అంత్యక్రియల కోసం శ్మశానాల ముందు మృతదేహాలతో పడిగాపులు, కోవిడ్ మృతులతో నిండిపోయిన చైనా శ్మశానాలు

చైనాలో కరోనా కొత్త వేరియంట్‌ బీఎఫ్‌7 వందలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. రోజూ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. మరణాలు తెలియనీయకుండా చైనా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సోషల్‌ మీడియాల్లో వీడియోలు బయటకు వస్తున్నాయి.

Coronavirus in India (Photo Credits: PTI)

చైనాలో కరోనా కొత్త వేరియంట్‌ బీఎఫ్‌7 వందలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. రోజూ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. మరణాలు తెలియనీయకుండా చైనా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సోషల్‌ మీడియాల్లో వీడియోలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఆరోగ్య నిపుణులు ఎరిక్‌ ఫైగిల్‌ డింగ్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. అందులో అంత్యక్రియలు నిర్వహించేందుకు పెద్ద క్యూలైన్లో నిలుచుని మృతదేహాలను తీసుకెళ్తున్న బంధువుల హృదయవిదారక వీడియో వైరల్‌గా మారింది.

మీ ప్రియమైన వారి అంత్యక్రియల కోసం క్యూలైన్లలో వేచి ఉండటమే కాదు, ఆ సమయంలో వారిని మోసుకెళ్లాల్సి వస్తుందని ఊహించుకోండి. భయంకరమైన కోవిడ్‌ 19 చైనాను చుట్టివేయడంపై సానుభూతి చూపుదాం.’ అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ నుంచి ఓ డాక్యుమెంట్‌ లీక్‌ కావడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డిసెంబర్‌ 1 నుంచి 20 మధ్య దేశంలోని సుమారు 17.56 శాతం మంది 25 కోట్ల మందికి వైరస్‌ సోకింది. రోజుకు లక్షల మంది వైరస్‌ బారినపడుతున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement